Group 1 Mains Exam Schedule: జూన్ 3 నుంచి 10 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల 30నిమిషాల నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9.45 తర్వాత పరీక్ష హాలులోకి ప్రవేశం ఉండదని అభ్యర్థులకు సూచించారు. 10 జిల్లాలలో 11 సెంటర్లలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 8.30 నుంచి 9:30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని అదనంగా మరో 15నిమిషాలు ఉంటుందని.. 9.45గంటలు దాటితే లోపలికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జులైలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టులో గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయని వెల్లడించారు.
Group 1 Mains in AP: ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల - exam dates of group 1mains in ap
Group 1 Mains Exam Schedule: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 మెయిన్స్‌కు సంబంధించి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. జూన్ 3 నుంచి 10 వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
2023 జనవరి 8 న గ్రూప్ 1 పరీక్షలు జరిగాయని గౌతమ్ తెలిపారు. కేవలం పరీక్షలు జరిగిన 19 రోజులకే ఫలితాలను ప్రకటించామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిందని.. గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 1లక్షా 26వేల 449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 6వేల 455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని తెలిపారు. రెండు పేపర్లను.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు లక్షా 26 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 75 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. 2019 నుంచి 2023 మధ్య ఇప్పటి వరకు 5వేల 447 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్-2 నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అవుతాయని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రశ్నలు: 2023 జనవరి 8న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం నిర్వహించిన మొదటి పేపర్‌లో.. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ విభాగంలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్, కౌలు రైతులు, నవరత్నాలు, దిశ యాప్, పోలవరానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో పేపర్లో కరెంట్ ఎఫైర్స్ విభాగంలో మత్స్యకార భరోసా, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, మైనారిటీలకు ప్రత్యేక బడ్జెట్, ఉర్దూ అధికార భాషగా ప్రకటన, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఓడరేవుల నిర్మాణాలపై ప్రశ్నలు అడిగారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో అడిగిన అంశాలపై మెయిన్స్ కూడా ఉండొచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు.