దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 'కొవిడ్ నిబంధనల ఉల్లంఘన'పై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ వేవ్ గురించి ప్రజలు 'వాతావరణ అప్డేట్స్'లా చర్చిస్తున్నారని పేర్కొన్నారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. కానీ, కొవిడ్‌ను అరికట్టేందుకు పాటించాల్సిన నిబంధనలను మరిచారని అన్నారు. మరిన్ని వేవ్‌లు రాకుండా ముందుజాగ్రత్తలు పాటించాలనే ధ్యాసలో ప్రజలు లేకపోవడం బాధాకరమని తెలిపారు.
ఈ అంశంపై మాట్లాడిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వైరస్ మూడో ఉద్ధృతి పరిస్థితులు చూశామని అని అన్నారు. భారత్‌లో ఈ పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకే ఉందని గుర్తుచేశారు.
ఆ రాష్ట్రాల్లోనే..
దేశంలో జులైలో నమోదైన కేసుల్లో.. 73.4 శాతం కేసులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచే ఉన్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.