తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సమ్మె ఎఫెక్ట్​.. 28 కి.మీ నడిచి వధువు ఇంటికి వెళ్లిన వరుడు.. చివరకు..

వధువు ఇంటికి చేరుకోవానికి వరుడుతోపాటు అతడి కుటుంబ సభ్యులు 28 కిలోమీటర్లు నడిచారు. సాయంత్రం ఆరు గంటలకు నడక ప్రారంభించిన వీరు.. వేకువజామున మూడు గంటలకు వధువు ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలెందుకు వారు నడిచి వెళ్లారు?

Groom walks 28 kilometers in odisha
Groom walks 28 kilometers in odisha

By

Published : Mar 18, 2023, 8:13 AM IST

Updated : Mar 18, 2023, 10:39 AM IST

సమ్మె ఎఫెక్ట్​.. 28 కి.మీ నడిచి వధువు ఇంటికి వెళ్లిన వరుడు.. చివరకు..

డ్రైవర్ల సమ్మె కారణంగా 28 కిలోమీటర్లు నడిచి.. వధువు ఇంటికి చేరుకున్నాడు ఓ వరుడు. కుటుంబ సభ్యులతో కలిసి 9 గంటల పాటు నడిచాడు. సాయంత్రం 6 గంటలకు నడక ప్రారంభించి వేకువజామున 3 గంటలకు వధువు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. బుధవారం నుంచి రాష్ట్రంలోని డ్ల్రైవర్లంతా సమ్మె చేస్తున్న కారణంగా.. రవాణా సేవలన్ని నిలిచిపోయాయి. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు చేసేదేమి లేక నడుచుకుంటూ పెళ్లికి వెళ్లారు. వీరంతా రాత్రి సమయంలో నడుస్తూ వధువు ఇంటికి చేరుకున్నారు.

రాయగడ జిల్లా.. కల్యాణ్‌ సింగ్‌పుర్ బ్లాక్​లోని సునాఖండి పంచాయతీకి చెందిన రమేష్ ప్రస్కా అనే యువకుడికి.. దిబలపాడుకు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం వధువు ఇంటి వద్ద.. వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి కోసం నాలుగు వాహనాలను ఏర్పాటు చేశాడు వరుడు. కానీ రాష్ట్రంలోని డ్రైవర్లు సమ్మె చేయడం వల్ల.. వాహనాల్లో వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో కాలినడకనే వధువు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సమ్మెతో పెళ్లి కొడుకు తరఫున వారంతా కాస్త ఇబ్బందులకు గురయ్యారు. సామాన్య ప్రజలు సైతం.. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిన కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వధువు ఇంటికి నడిచి వెళ్తున్న వరుడు, అతడి కుటుంబ సభ్యులు

శుక్రవారం ఉదయం పెళ్లి జరిగిన అనంతరం.. వరుడు కుటుంబ సభ్యులంతా వధువు ఇంటి వద్దే బస చేశారు. డ్రైవర్​ల సమ్మె ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూశారు. శుక్రవారం సాయంత్రం.. డ్రైవర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన కారణంగా సమ్మెను విరమించారు. దీంతో వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు ఇంటికి వెళ్లేందుకు మార్గం సుగమం అయింది.

వధువు ఇంటికి నడిచి వెళ్తున్న వరుడు, అతడి కుటుంబ సభ్యులు

డ్రైవర్ల సమ్మె..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా డ్రైవర్లు సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. బుధవారం నుంచి సమ్మె ప్రారంభించారు. బీమా, పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి డిమాండ్​లతో వీరంతా సమ్మె చేశారు. మూడు రోజులు పాటు వీరి సమ్మె కొనసాగింది. డ్రైవర్ల సమ్మెపై ప్రభుత్వం దిగివచ్చింది. 90 రోజుల్లో వారి సమస్యల పరిష్కారిస్తామని హామీ ఇచ్చింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​, రాష్ట్ర డీజీపీ సమ్మె విరమించాలను డ్రైవర్ల అసోసియేషన్​కు విజ్ఞప్తి చేశారు. దీంతో డ్రైవర్లు సమ్మెను విరమించారు.

మండపానికి వెళ్లడం మర్చిపోయిన పెళ్లికొడుకు..
ఏకంగా తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు ఓ వరుడు! ముహుర్త సమయానికి వివాహ మండపానికి వెళ్లకుండా ఆలస్యంగా వెళ్లాడు. అది కూడా మద్యం తాగి మండపానికి చేరుకున్నాడు. అప్పటికే వరుడి కోసం మండపంలో ఎదురుచూస్తున్న వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. పూర్తి వివరాల ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Mar 18, 2023, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details