ప్రియురాలిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలతో జైలుకెళ్లాడు ఓ యువకుడు. న్యాయస్థానం అనుమతితో జైలు నుంచి తాత్కాలికంగా విడుదలైన ఆ యువకుడు.. కోర్టు ఆవరణలోని ఓ ఆలయంలో ప్రేమించిన యువతిని పెళ్లాడాడు. యువతి, యువకుడి వివాహానికి ఇరువురి కుటుంబాలు ఒప్పుకోవడం వల్ల.. కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌లో ఈ ఘటన జరిగింది.
ప్రియురాలిని వివాహం చేసుకుంటున్న రాజా సీతామర్హి జిల్లాలోని బర్గానియా ప్రాంతంలో నివాసం ఉండే.. రాజా(28), అదే ప్రాంతానికి చెందిన అర్చన(23) అనే యువతి 2016 నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది నవంబరులో వారిద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో యువతి తండ్రి.. రాజాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురుని రాజా కిడ్నాప్ చేశాడని వారికి వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అప్పటి నుంచి రాజా జైలులోనే ఉన్నాడు.
ప్రియురాలిని వివాహం చేసుకుంటున్న రాజా అయితే ఈ కేసుపై ఇటీవల స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో అర్చన, రాజాకి పెళ్లి జరిపిస్తామని ఇరువురి కుటుంబ సభ్యులు కోర్టుకు విన్నవించారు. దీనికి న్యాయస్థానం సైతం సమ్మతి తెలిపింది. శనివారం వారిద్దరికి పెళ్లి జరిపించాలని అదేశించింది. అనంతరం కేసును జూన్ 19కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి జైలు నుంచి విడుదలైన రాజా.. పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తిరిగి రాజాను పోలీసులు జైలుకు తీసుకెెళ్లారు.
రాజా వివాహం వద్ద ఉన్న జైలు సిబ్బంది పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు..
కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే బిహార్‌లో జరిగింది. పెళ్లి కోసం నాలుగు గంటల పాటు పెరోల్‌పై విడుదయ్యాడు ఓ యువకుడు. అత్యాచారం కేసులో జైలులో ఉన్న ఆ యువకుడు.. బయటకు వచ్చి బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. 20 రోజుల క్రితం అత్యాచారం కేసులో జైలుకెళ్లిన యువకుడు.. బాధితురాలితో కలిసి పెళ్లిపీటలెక్కాడు.
ఇదీ జరిగింది
ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి పేరు.. రాహుల్ కుమార్. ఇతడు బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామానికి చెందిన వ్యక్తి. రాహుల్ కుమార్ హజీపుర్లో ఇంజనీరింగ్ చదివాడు. బాధిత యువతి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. వీరిద్దరు మంచి స్నేహితులు. కొద్ది రోజుల తరువాత వీరి స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా వీరిద్దరు ఒక రోజు ఓ ఫ్రెండ్ రూంలో కలుసుకున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది. ప్రైవేటు భాగంలో రక్తస్త్రావం కూడా అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.