తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాన్న మరణించి ఏడాది.. అయినా పెళ్లి మండపంలో కుమారుడికి దీవెనలు! - మైసూర్​ పెళ్లి

Groom Wedding Vows Infront Deceased Father: కొన్ని బంధాలను మరిచిపోలేం. అందులోనూ తండ్రీకొడుకుల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి నిదర్శనంగా.. చనిపోయిన తన తండ్రి మైనపు విగ్రహం తయారుచేయించి ఆ ప్రతిమ ముందే తన వివాహ వేడుకలను​ చేసుకున్నాడు ఓ వ్యక్తి. కర్ణాటక మైసూర్​లో కనిపించిందీ సన్నివేశం.

Groom exchanges wedding vows in front of wax statue of deceased father
Groom exchanges wedding vows in front of wax statue of deceased father

By

Published : May 8, 2022, 12:25 PM IST

Updated : May 8, 2022, 1:19 PM IST

Groom Wedding Vows Infront Deceased Father: కుటుంబసభ్యుల్లో ఎవరైనా దూరమైతే.. వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తుంటారు. శుభకార్యాల్లో వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొందరు వారి లోటును పూడ్చుకునేందుకు మైనపు విగ్రహాలు తయారు చేయిస్తూ కార్యక్రమాలను జరిపిస్తున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటక మైసూర్​లోనూ అదే జరిగింది.

రమేశ్​ మైనపు విగ్రహం
తండ్రీకొడుకుల అనుబంధానికి సాక్ష్యంగా నిలిచే ఈ సన్నివేశం మైసూర్​లోని నంజనగూడులో కనిపించింది. చిక్కమగళూరు జిల్లా కడూరుకు చెందిన డాక్టర్​ యతీశ్ తండ్రి రమేశ్​.. కొవిడ్​ కారణంగా గతేడాది మరణించారు. యతీశ్​కు ఇటీవల అపూర్వ అనే మరో డాక్టర్​తో పెళ్లి కుదిరింది. నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీశ్​.. తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు. అప్పుడే యతీశ్​కు ఒక ఐడియా తట్టింది. తన తండ్రి మైనపు విగ్రహం చేయించాడు. ఆదివారం వీరి వివాహం. తండ్రి మైనపు విగ్రహం ముందే శనివారం వివాహ రిసెప్షన్​ జరిగింది. కుటుంబసమేతంగా వివాహ వేడుకల్లో ఫొటోలు కూడా దిగారు. యతీశ్​ తల్లి.. మైనపు విగ్రహం పక్కనే కూర్చొని పెళ్లి తంతు జరిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అచ్చం జీవం ఉన్న మనిషిని పోలిన స్టాట్యూను చూసి బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. తన తండ్రి స్వయంగా ఆశీర్వదించినట్లే ఉందని ఆనందపడిపోయాడు యతీశ్​.
తండ్రి మైనపు విగ్రహం ముందు కుమారుడి పెళ్లి తంతు
తండ్రి మైనపు విగ్రహంతో కుటుంబసమేతంగా ఫొటోలు దిగిన డాక్టర్​ యతీశ్​, అపూర్వ

''మా నాన్న గతేడాది కొవిడ్​తో మరణించారు. నేను ఆయనను మరిచిపోలేకపోతున్నాను. ఆయన లేకుండా పెళ్లి చేసుకోలేను. అప్పుడే కుటుంబంతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చా. నా తండ్రి మైనపు విగ్రహాన్ని తయారుచేయించా. ఇప్పుడు మా నాన్న మాతో ఉన్నట్లే అనిపిస్తోంది.''

Last Updated : May 8, 2022, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details