తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లైన మూడు రోజులకే కరోనాతో వరుడు మృతి - కరోనాతో నవ వరుడు మృతి

పెళ్లైన మూడు రోజులకే ఉత్తర్​ప్రదేశ్​లోని బిజ్నోర్​కు చెందిన నవ వరుడు కరోనాతో మరణించాడు. దీంతో ఆ కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుడు ఆక్సిజన్​ కొరతతోనే మరణించాడని స్థానికులు తెలిపారు.

groom died
కరోనాతో నవ వరుడు మృతి

By

Published : May 1, 2021, 3:34 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బిజ్నోర్​లోని ఓ పెళ్లింట్లో విషాదం జరిగింది. పెళ్లైన మూడు రోజులకే ఓ వరుడు కరోనాతో మృతిచెందాడు.

ఇదీ జరిగింది..

మోహల్లా జాటాన్ ప్రాంతానికి చెందిన అర్జున్, చాంద్​పుర్​లోని సియావ్​కు చెందిన బబ్లీతో ఏప్రిల్ 25న వివాహం జరిగింది. పెళ్లిమండపం నుంచి ఇంటికి వచ్చిన యువకుడికి జ్వరం రాగా.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్​ పాజిటివ్ అని తేలింది. ఏప్రిల్​ 29 ఉదయం అర్జున్ మరణించాడు.

ఆక్సిజన్ కొరతతోనే యువకుడు మరణించాడని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ అధికారులు కరోనా పరీక్షలు చేయించారు.

ఇదీ చదవండి :ఆక్సిజన్​ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details