పంజాబ్ పఠాన్‌కోట్‌లోని(Pathankot News) ధీరాపుల్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ ఎదుట గ్రనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఆర్మీ ఆఫీస్ వద్ద ఉన్న త్రివేణి గేట్(Pathankot News) పక్కన సోమవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
గుర్తుతెలియని దుండగులు.. ద్విచక్రవాహనంపై వచ్చి గ్రనేడ్‌ను(Pathankot news army) విసిరి పారిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అదే సమయంలో అక్కడ ఓ వివాహం జరుగుతోందని పేర్కొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రనేడ్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన.. గ్రనేడ్ పదార్థాలను సేకరించినట్లు తెలిపారు.