తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసులపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి - జమ్ముకశ్మీర్ లో పోలీసులపై గ్రనేడ్ దాడి

జమ్ముకశ్మీర్ లో పోలీసులపై ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడి జరిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Grenade attack on police
గ్రనేడ్ దాడి

By

Published : May 12, 2021, 12:12 PM IST

జమ్ముకశ్మీర్‌ సాంబా జిల్లాలో పోలీసులు తృటిలో గ్రనేడ్ దాడి నుంచి తప్పించుకున్నారు. సాంబా- ఉదంపూర్‌ రోడ్డుపై నిర్బంధ తనిఖీలు నిర్విహిస్తుండగా.. ముష్కరులు గ్రనేడ్‌ దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులపై గ్రనేడ్ దాడి

ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ప్రదేశానికి దూరంగా పడి పేలినట్లు వివరించారు. తప్పించుకున్న ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

పోలీసులపై గ్రనేడ్ దాడి

ABOUT THE AUTHOR

...view details