తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఇంట్లోనే పూడ్చి.. - గ్రేటర్ నోయిడా వార్తలు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కిరాతకుడు. అంతటితో ఆగకుండా ఇద్దరు చిన్నారులను సైతం చంపాడు. ఎవరికీ తెలియకుండా మృతదేహాలను ఇంట్లోని బేస్​మెంట్ కింద పూడ్చాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Greater Noida Police
గ్రేటర్ నోయిడా

By

Published : Sep 2, 2021, 8:35 PM IST

గ్రేటర్ నోయిడా క్రైం వార్తలు

తన ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తున్నారన్న కారణంగా కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను కడతేర్చాడు ఓ కిరాతకుడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను ఇంట్లోని బేస్​మెంట్ కింద పూడ్చిపెట్టాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. మూడేళ్ల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ దారణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగిందంటే..?

ఉత్తర్​ప్రదేశ్​​, గ్రేటర్ నోయిడా, బిస్రక్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో.. నిందితుడు తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. అక్కడ పనిచేసే ఓ మహిళా పోలీస్ అధికారితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నారని భావించిన నిందితుడు.. పథకం ప్రకారం ఓ పోలీస్ అధికారి సాయంతో.. భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు. ఎవరికీ తెలియకుండా వారిని ఇంట్లోని బేస్​మెంట్​ కింద పూడ్చిపెట్టాడు.

ఈ కేసు విచారణలో భాగంగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్​మెంట్ కింద తవ్వగా.. అస్థిపంజరాలు బయటపడ్డాయి.

ఇదీ చదవండి:Family murder: సొంత కుటుంబాన్నే కడతేర్చిన కొడుకు

ABOUT THE AUTHOR

...view details