మహారాష్ట్రలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పుణె జిల్లా వాణే గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. గతవారం ఎన్నికల సందర్భంగా ఓ 113 ఏళ్ల బామ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అదే రోజు కన్నుమూశారు. ఎన్నికల్లో పోటీ చేసిన తన మనవడికే చివరి ఓటు వేసి ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆమె మనవడు కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందాడు. ఆ బామ్మ వేసిన ఓటే మనవడి విజయానికి కారణమైంది.
చనిపోయేముందు మనవడ్ని గెలిపించిన 113 ఏళ్ల బామ్మ - maharashtra pune district news
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన గ్రామ పంచయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటుచోసుకేంది. పుణె జిల్లాకు చెందిన ఓ 113ఏళ్ల బామ్మ తన మనవడికి ఓటేసిన తర్వాత తుదిశ్వాస విడిచింది. అనంతరం వెల్లడైన ఫలితాల్లో ఆమె మనవడు ఒక్క ఓటు తేడాతో గెలుపొందాడు. తాను చనిపోయే ముందు మనవడిని గెలిపించిన ఈ బామ్మ గురించి ఇప్పుడు మహారాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

చనిపోయేముందు మనువడ్ని గెలిపించిన 113 ఏళ్ల బామ్మ
ఓ వైపు ఎన్నికల్లో గెలిచిన ఆనందం, మరోవైపు బామ్మ మరణించారనే బాధను ఆ కుటుంభ సభ్యులు ఒకేసారి అనుభవిస్తున్నారు.