ఆస్తిపై దురాశతో బామ్మపై దౌర్జన్యానికి దిగాడు ఓ కిరాతక మనవడు. కుక్కతో కరిపించి తీవ్రంగా గాయపరిచాడు. ఈ హృదయవిదారక ఘటన దిల్లీలో వెలుగుచూసింది.
అసలేమైందంటే..?
70ఏళ్ల వృద్ధురాలు దిల్లీలోని తూర్పు వినోద్ నగర్ ప్రాంతంలో తన మవవడితో నివాసముంటుంది. బామ్మ ఆస్తిపై కన్నేసిన మనవడు.. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ బామ్మను హింసించడం మొదలుపెట్టాడు. ఆరు నెలల క్రితం ఓ కుక్కను ఇంటి తీసుకొచ్చాడు. ఆ శునకాన్ని చూసి భయపడిన బామ్మ.. దాన్ని బయట వదిలేయమని ప్రాధేయపడింది. అయినా వినిపించుకోని మనవడు.. ఆ కుక్కను ఇంట్లోనే ఉంచాడు. దానితోనే బామ్మను బెదిరించేవాడు. చిత్ర హింసలకు గురిచేసేవాడు. చివరకు ఆమెపై కుక్కను ఉసిగొల్పి.. కరిపించాడు. దీంతో విసుగుపోయిన బాధితురాలు జనవరి 13న దిల్లీ మహిళా కమిషన్‌ను(డీసీడబ్ల్యూ) ఆశ్రయించింది. హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి విషయాన్ని వివరించింది.