తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. చారిత్రక కట్టడాలు, రైల్వే స్టేషన్లను విద్యుద్దీపాలతో గులాబీమయంగా తీర్చిదిద్దారు. మహిళలకు మద్దతుగా దిల్లీ పోలీసులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తన భద్రతా సిబ్బంది మొత్తాన్ని మహిళలనే నియమించుకోవం విశేషం.

grand women's day celebrations across the country
దేశవ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవం

By

Published : Mar 8, 2021, 10:09 AM IST

Updated : Mar 8, 2021, 12:14 PM IST

‌అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలకు మద్దతుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ముంబయిలోని చారిత్రక శివాజీ మహారాజ్ టెర్మినల్‌ను గులాబీ విద్యుద్దీపాలతో అలంకరించారు. విద్యుద్దీపాల వెలుగులో ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ గులాబీమయంగా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్​నవూలోని చార్‌బాగ్‌ రైల్వే స్టేషన్‌ కూడా విద్యుద్దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నోయిడాలో మహిళా దినోత్సవం సందర్భంగా పింక్‌ మారథాన్‌ నిర్వహించారు. ఈ మారధాన్‌లో భారీ సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

పింక్​ విద్యుద్దీపాల వెలుగులో చార్​బాగ్​ రైల్వే స్టేషన్​
నోయిడా పింక్‌ మారథాన్‌ పోస్టర్​

దిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ మైదానంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సాయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆల్ ఇండియా ఉమెన్‌ ఫిట్‌ వాకథాన్‌ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించారు. ఇందులో భారీ సంఖ్యలు మహిళలు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన భద్రతా సిబ్బంది మొత్తాన్ని మహిళలనే నియమించారు. మహిళా డ్రైవర్‌ నడిపిన వాహనంలో వచ్చిన చౌహాన్‌ మహిళా పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. వారి సమస్యలను తెలుసుకున్నారు.

మహిళా పారిశుద్ధ్య కార్మికులతో కలసి చీపురుపట్టిన మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​

దిల్లీలో మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

దిల్లీ పోలీసు విభాగం ఆధ్వర్యంలో సైకిల్​ ర్యాలీ..
Last Updated : Mar 8, 2021, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details