Grand Mother File Case On Grand Son: దేశ రాజధాని దిల్లీలో ఆసక్తికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పెంపుడు కుక్క కరిచిందనే కారణంతో సొంత మనవడిపైనే ఫిర్యాదు చేసింది ఓ వృద్ధురాలు. దీంతో మనవడిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని సార్లు చెప్పినా మనవడు మాట వినకపోవడం వల్లే ఫిర్యాదు చేసినట్లు వృద్ధురాలు పేర్కొన్నారు.
మనవడిపై బామ్మ పోలీసు కేసు.. పెంపుడు శునకం కరిచిందని.. - సొంత మనవడిపై కేసు పెట్టిన అమ్మమ్మ
Grand Mother File Case On Grand Son: తన మనవడి పెంపుడు శునకం కరిచిందని అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ వృద్ధురాలు. ఈ ఆసక్తికర ఘటన దిల్లీలో జరిగింది. మనవడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జగత్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివపురి సిల్వర్ పార్క్‌లో 75 ఏళ్ల రమాదేవి నివసిస్తున్నారు. ఆమెతో పాటు కుమార్తె సునీత, అల్లుడు, ఇద్దరు మనువళ్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన మనవళ్లలో ఒకరైన జతిన్.. తొమ్మిది నెలల క్రితం కుక్కను ఇంటికి తెచ్చుకున్నాడు. కుక్కను కట్టివేయకుండా ఇంట్లోనే ఉంచడం వల్ల మొరుగుతూ ఇతరులను కరిచేది. కుక్కను కట్టివేయమని ఎంత చెప్పినా అతడు ఆమె మాట వినలేదు. మే 5న ఉదయం 11:30 గంటలకు ఇంటిని శుభ్రం చేస్తుండగా రమాదేవిని శునకం కరిచింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బామ్మ ఫిర్యాదు మేరకు మనవడిపై చర్యలు తీసుకుంటామని పోలీసుల తెలిపారు.
ఇదీ చదవండి:పెళ్లిలో పవర్ కట్.. మారిపోయిన వధూవరులు.. ఒకరితో మరొకరు...