తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆడపిల్ల పుట్టిందని సంబరం.. హెలికాప్టర్​లో ఇంటికి.. - family brought their newborn girlchild in a chopper

మహారాష్ట్ర పుణెలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టడంపై సంతోషం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. శిశువును ఆస్పత్రి నుంచి ఇంటికి హెలికాప్టర్​లో తీసుకువచ్చారు.

Infant Grand Homecoming
ఆడపిల్లకు గ్రాండ్​ ఎంట్రీీ

By

Published : Apr 6, 2022, 5:19 AM IST

Updated : Apr 6, 2022, 2:23 PM IST

ఆడపిల్ల పుట్టిందని సంబరం.. హెలీకాప్టర్​లో ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు

మహారాష్ట్ర పుణెలో ఆడపిల్ల పుట్టిందని ఉప్పొంగిపోయిన ఓ కుటుంబ సభ్యులు పసిపాపను ఇంటికి తీసుకువచ్చేప్పుడు ఘనంగా ఆహ్వానం పలికారు. ఆస్పత్రి నుంచి ఇంటివరకు హెలికాప్టర్​లో తీసుకువచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ చిన్నారి పేరు రాజ్యలక్ష్మి. జనవరి 22న భొసారి పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి విశాల్ జరేకర్​(30) ' చాలాకాలం తర్వాత మాకు ఆడబిడ్డ కలిగింది. చిన్నారి పుట్టడంపై చాలా ఆనందంగా ఉన్నాం. ఆస్పత్రి నుంచి ఇంటివరకు హెలికాప్టర్​పై వచ్చాం.' అయితే.. హెలికాప్టర్ స్థానికంగా తమ వ్యవసాయ క్షేత్రంలో లాండింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపాడు.

Last Updated : Apr 6, 2022, 2:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details