Gudi Padwa 2022: మహారాష్ట్రలో గుడిపడ్వా సంబరాలు అంబరాన్నంటాయి. నాగ్‌పుర్, పుణె, ముంబయి, ఠాణె సహా వివిధ నగరాల్లో చిన్నా, పెద్దా అంతా రంగురంగుల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టులో ముస్తాబైన మహిళలు బైక్ ర్యాలీలతో ఆకట్టుకున్నారు. కత్తిసాము, కర్రసాము చేసి సత్తా చాటారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సంబరాలకు దూరమైన మరాఠీలు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో పండగ జరుపుకున్నారు. ముంబయి సహా అనే నగరాల్లోని వీధులు శోభాయాత్రలతో కోలాహలంగా మారాయి.
ముంబయిలోని గిర్గావ్ ప్రాంతంలో మహిళలు నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ ర్యాలీలో 151 మంది బుల్లెట్ బండి నడిపి అదరగొట్టారు. పలు ప్రాంతాల్లో మహిళలు చేసిన నృత్యాలు కూడా ఆకట్టుకున్నాయి. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా శనివారం తమ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నాయి. ఉగాది, చేటీ చాంద్, సాజిబు చెయ్రోబా మొదలైనవి ఇందులో భాగం.