తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gram Panchayat Resolution On Love Marriages : 'తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే లవ్ మ్యారేజ్​'.. గ్రామ పంచాయతీ నిర్ణయం - Special Meeting On Love Marriages

Gram Panchayat Resolution On Love Marriages : ప్రేమ వివాహాలపై సంచలన తీర్మానం చేసింది కర్ణాటకలోని ఓ గ్రామపంచాయతీ. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేసుకునే వివాహాలను నిషేధించాలని కోరుతూ నిర్ణయం తీసుకుంది. దీని వెనక పెద్ద కథే ఉంది. అదేంటంటే?

Gram Panchayat Resolution On Love Marriages
Gram Panchayat Resolution On Love Marriages

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 9:49 AM IST

Updated : Oct 17, 2023, 10:16 AM IST

Gram Panchayat Resolution On Love Marriages : కర్ణాటకలోని ఓ గ్రామ పంచాయతీ ప్రేమ వివాహాలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామంలో తల్లిదండ్రుల అనుమతి లేని ప్రేమ వివాహాలను ప్రభుత్వం నిషేధించాలని కలబురిగి జిల్లా డోంగర్​గావ్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. గ్రామ సర్పంచ్ శాంతకుమార్ కె ములాగే , పంచాయతీ సభ్యులు గ్రామసభ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

"ప్రేమ వివాహాల వల్ల వారి ఇరువురి కుటుంబాల్లోను తరచూ వివాదాలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రేమికులు వివాహమైన కొద్ది రోజులకే విడిపోతున్నారు. కొద్దికాలానికే వారి బంధం విడిపోతుంది. అందువల్లనే ఇటువంటి ప్రేమ వివాహాలు నిషేధిస్తూ గ్రామపంచాయతీలో తీర్మానం చేశాం."
- శాంతకుమార్ కె ములాగే , డోంగర్​గావ్ గ్రామ పంచాయతీ సర్పంచ్

ప్రేమ వివాహాలపై నిర్ణయానికి ప్రత్యేక సమావేశం..
తల్లిదండ్రుల సమ్మతి లేకుండా యువతీయువకులు చేసుకునే ప్రేమ వివాహాలపై నిర్ణయం తీసుకునేందుకు సర్పంచ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు అనుమతిస్తే ప్రేమికులు వివాహం చేసుకోవచ్చని పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. ప్రేమ వివాహాలను నిషేధిస్తూ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. సర్పంచ్, గ్రామ పంచాయతీసభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రేమ వివాహాల పట్ల నిర్ణయానికి కారణం
డోంగర్​గావ్ గ్రామపంచాయతీ పరిధిలో గత ఏడాదే 15 జంటలు ప్రేమ వివాహాలు చేసుకున్నాయి. చాలా మంది ప్రేమలో పడి వారి తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. డోంగరగావ్​ గ్రామపంచాయతీ పరిధిలో నాలుగు చిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు 18 మంది పంచాయతీ వార్డు మెంబర్లు ఉన్నారు.

కొన్నాళ్ల క్రితం గుజరాత్​లో కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తీసుకునే విధంగా చేయడానికి ఓ వ్యవస్థను తీసుకువచ్చేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నామని గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు విపక్ష కాంగ్రెస్ నాయకుడి నుంచి మద్దతు లభించడం విశేషం.

తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం.. గుజరాత్​లో కొత్త రూల్! రాజ్యాంగం అనుమతిస్తుందా?

Transgender marriage: ట్రాన్స్​జెండర్​తో యువకుడి ప్రేమ వివాహం

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భద్రాద్రి అబ్బాయి.. ఫ్రాన్స్​ అమ్మాయి

Last Updated : Oct 17, 2023, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details