నూతన సాగు చట్టాలను ఒకటిన్నరేళ్ల పాటు నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను అత్యుత్తమ ప్రతిపాదనగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభివర్ణించారు. ఈ మేరకు రైతు సంఘాలు త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం, రైతుల మధ్య జరిగిన చర్చలు 11వ దఫా సైతం అసంపూర్తిగానే ముగిశాయి. అంతకుముందు 10వసారి చర్చల్లో ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 11వ దఫా చర్చల్లో చట్టాల అమలు తాత్కాలిక వాయిదా అంశాన్ని పరిశీలించాలని తోమర్ సూచించారు.
సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇది ఉత్తమమైన ప్రతిపాదన. రైతు సంఘాలు దీనిపై చర్చించుకుని ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే తమ నిర్ణయం వెల్లడిస్తారని కోరుకుంటున్నా.
-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
చర్చలుండవ్: తోమర్