తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారి కోసం రైతులకు కేంద్రం అన్యాయం' - Chhattisgarh

ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకోసం రైతుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందని కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛత్తీస్​గఢ్​లో రైతులకు నగదు బదిలీ చేసే కార్యక్రమంలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

CG-FARMERS-RAHUL
'వారికోసం రైతుల భవిష్యత్తును లాక్కుంటున్న కేంద్రం'

By

Published : Mar 21, 2021, 2:53 PM IST

ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడం కోసం రైతుల దగ్గర నుంచి ఆదాయాన్ని, వారి భవిష్యత్తును కేంద్రం లాక్కుంటోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. అందుకోసమే నూతన వ్యవసాయ చట్టాల్ని తెచ్చిందని విమర్శించారు. ఛత్తీస్​గఢ్​లో రైతులకు నగదు బదిలీ పథకం(రాజీవ్​గాంధీ కిసాన్​ న్యాయ్​ యోజన) ఫలాలను అందజేసే కార్యక్రమంలో ఈమేరకు వీడియో సందేశం ఇచ్చారు రాహుల్.

"కేంద్రం రైతులు ప్రయోజనాల్ని దెబ్బతీయాలని చూస్తోంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్​ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల, శ్రామికల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. గ్రామాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కాంగ్రెస్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని మరోసారి రాహుల్​ ఆరోపించారు.

ఇదీ చదవండి:'ఐదేళ్లలో చొరబాట్లు లేని రాష్ట్రంగా బంగాల్'

ABOUT THE AUTHOR

...view details