కరోనాపై పోరులో భాగంగా ఆక్సిజన్‌తో కూడిన 10వేల పడకలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ప్రాణవాయువును ఉత్పత్తి చేసే పరిశ్రమలకు దగ్గరగా తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వరుస సమీక్షలు నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తికి సంబంధించి అన్నీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే నత్రజని ప్లాంట్లను గుర్తించి వాటి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
"మహమ్మారిని ఎదుర్కోవడానికి తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. వీటి ద్వారా అతి తక్కువ సమయంలో సుమారు ఆక్సిజన్‌తో కూడిన 10వేల పడకలు అందుబాటులోకి తీకుసురావాలని నిర్ణయించాం. ఇలాంటి ఆసుపత్రులను వీలైనంత ఎక్కువగా నిర్మించాలని రాష్ట్రప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నాము."