ఒకే వ్యక్తి పలు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కాకుండా నివారించడానికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ వ్యవస్థతో అనుసంధానం చేయాలంటూ ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వ పరిశీలనలో ఓటు-ఆధార్ అనుసంధానం - కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్
ఓటు-ఆధార్ అనుసంధానం చేయాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ వెల్లడించారు. అది అమలు చేయాలంటే ఎన్నికల చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పరిశీలనలో ఓటు-ఆధార్ అనుసంధానం
ఈసీ ప్రతిపాదన అమలు చేయాలంటే ఎన్నికల చట్టాల్లో సవరణులు చేయాల్సి ఉంటుందని బుధవారం లోక్సభలో డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి :అత్యాచారం జరిగిన 26 రోజుల్లోనే దోషికి మరణశిక్ష