కరోనా విజృంభిస్తున్న వేళ.. దేశంలోని పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎండీకేఓవై) కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార దినుసులు అందించాలని నిర్ణయించింది కేంద్రం. ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున అందించనుంది. పీఎండీకేఓవైలో భాగంగా రెండు నెలల పాటు మొత్తం 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పేదలకు 2 నెలలు ఉచితంగా రేషన్! - ఉచితంగా ఆహార దినుసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గతేడాది మాదిరిగానే పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది కేంద్రం. పీఎండీకేఓవైలో భాగంగా మే, జూన్ నెలల్లో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున అందించనుంది.
![పేదలకు 2 నెలలు ఉచితంగా రేషన్! free food grains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11511129-83-11511129-1619174402697.jpg)
పేదలకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ!
కరోనాతో దేశ ప్రజలు పోరాడుతున్న వేళ వారికి పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పినట్లు ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. ఈ పథకం కోసం రెండు నెలలకు కేంద్రం రూ. 26 వేల కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'మే 15కు కరోనా ఉగ్రరూపం.. ఆ తర్వాత...'