National helpline for SC ST: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ.. 14566 నంబరుతో జాతీయస్థాయి హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది. దీని ప్రారంభోత్సవం సోమవారం జరుగుతుంది.
ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్)యాక్ట్ 1989ని సమర్థంగా అమలుచేయడం కోసం నేషనల్ హెల్ప్‌లైన్ అగైనెస్ట్ అట్రాసిటీస్ (ఎన్‌హెచ్‌ఏఏ) పేరుతో ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వివక్షను అంతం చేయడం, అందరికీ రక్షణ కల్పించడం కోసం చట్టంలోని నిబంధనల గురించి అవగాహన కల్పించడం హెల్ప్‌లైన్ లక్ష్యం.