పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానుండగా.. తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 'కొంతమంది' రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారని.. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఇప్పటికే సోమవారం సభా కార్యకలాపాల జాబితాలో బిల్లును చేర్చిన కేంద్రం.. ఆ రోజే ఆమోదం తెలిపే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. లోక్‌సభలో సాగుచట్టాల రద్దు బిల్లు ప్రవేశ పెట్టనున్నారు.
ఈనెల 19న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ 3 సాగు చట్టాలను రద్దు (modi on farmers law) చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగా అధికారులు వేగంగా ఈ బిల్లు రూపొందించారు.