ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే కరోనా వ్యాక్సిన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా నిర్దేశించిన ధరల ప్రకారం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర గరిష్ఠంగా రూ. 780లుగా ఉండగా.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా రూ.1410, రష్యాకు చెందిన స్పుత్నిక్-వి రూ. 1145గా ఉండనుంది. అన్ని పన్నులతో పాటు ఆస్పత్రులకు రూ.150 సర్వీస్ ఛార్జి కూడా ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టంచేసింది. అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా.. కొత్త ధరలివే! - covishield vaccine price in private hospital
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలకు ధరలను ఖరారు చేసింది. కొవిషీల్డ్ ధర గరిష్ఠంగా రూ. 780, కొవాగ్జిన్ రూ. 1410, స్పుత్నిక్ వి రూ.1145గా నిర్ణయించింది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా
దేశవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం.. ఉచితంగా వద్దనుకొనేవారి కోసం 25శాతం వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది. వ్యాక్సిన్ గరిష్ఠ ధరపై రూ.150లు మాత్రమే సర్వీస్ ఛార్జి వసూలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
ఇదీ చూడండి:44కోట్ల టీకా డోసులకు కేంద్రం ఆర్డర్
Last Updated : Jun 9, 2021, 6:24 AM IST