తెలంగాణ

telangana

ETV Bharat / bharat

300 పదాలతో వ్యాసం రాస్తేనే సీవీసీ పదవి! - కేంద్ర విజిలెన్స్​ కమిషన్​

కేంద్ర విజిలెన్స్​ కమిషన్​ చీఫ్​ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది కేంద్రం. ఇందుకు 300 పదాలతో వ్యాసం రాసి పంపాలని పేర్కొంది. ప్రస్తుతం ఆ విధులు నిర్వహిస్తున్న సంజయ్​ కొఠారీ పదవీ కాలం వచ్చేనెలతో పూర్తి కానుంది.

CVC
సీవీసీ పోస్టు

By

Published : May 10, 2021, 6:59 PM IST

అవినీతి నిరోధక నిఘా సంస్థ కేంద్ర విజిలెన్స్​ కమిషన్​​(సీసీవీ) చీఫ్​ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది కేంద్రం. దీనికి అర్హత గల అభ్యర్థులు 300 పదాలకు మించకుండా వ్యాసం రాసి పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు జూన్​ 7 తేదీ లోపు తమ దరఖాస్తు పంపించాలని తెలిపింది.

ప్రస్తుతం ఉన్న సీవీసీ చీఫ్​ సంజయ్​ కొఠారీ పదవీ కాలం వచ్చే నెలతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అఖిల భారత సర్వీసులు/ ఏదైనా సివిల్ సర్వీసులో ఉన్న వ్యక్తులు/ విజిలెన్స్‌కు సంబంధించిన విషయాల్లో 25 ఏళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొంది.

సీవీసీలో సెంట్రల్​ విజిలెన్స్ కమిషనర్​ సహా మరో ఇద్దరు విజిలెన్స్​ కమిషనర్లకు ఉంటారు. ఈ పదవిలో నియమితులైన రోజు నుంచి నాలుగేళ్లు పాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు కొనసాగుతారు. ఏది ముందైతే దాని ప్రకారం తొలగిస్తారు.

ఇదీ చూడండి:'ప్రజా సేవ కంటే వ్యక్తిగత అజెండా ముఖ్యమా?'

ABOUT THE AUTHOR

...view details