తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే'

సాగుచట్టాల రద్దు కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఎప్పుడూ రైతుల సంక్షేమం కోసమే ప్రయత్నిస్తుందన్నారు.

Tomar
నరేంద్ర సింగ్ తోమర్

By

Published : Jun 9, 2021, 6:21 AM IST

Updated : Jun 9, 2021, 7:08 AM IST

రైతులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. అయితే.. సాగు చట్టాల రద్దు.. కాకుండా వాటికి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు సాగాలని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఎప్పుడూ రైతుల సంక్షేమం కోసమే ప్రయత్నిస్తుందన్నారు.

" కేంద్రం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమం కోసమే ఆలోచిస్తుంది. సాగు చట్టాలు కాకుండా ఇతర విషయాలపై అన్నదాతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్​లో భాజపాకు సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. సీఎంను మార్చే అవకాశం లేదు."

- నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. గతేడాది నవంబర్ నుంచి రైతులు ఉద్యమిస్తున్నారు.

ఇదీ చదవండి :దేశంలోని యువ రచయితలకు మోదీ పిలుపు

Last Updated : Jun 9, 2021, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details