తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు శుభవార్త.. ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు - ఆరు పంటల మద్దతు ధరను పెంచిన కేంద్రం

రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. గోధుమ, కందులు, ఆవాలకు కనీస మద్దతు ధరను పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. క్వింటాలు గోధుమలుపై రూ.110 పెంచగా.. కందులపై గరిష్ఠంగా రూ.500 పెంచినట్లు వెల్లడించారు.

msp rabi crops
కనీస మద్దతు ధర

By

Published : Oct 18, 2022, 1:34 PM IST

Updated : Oct 18, 2022, 2:15 PM IST

రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. కందుల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.500 పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోధుమలపై రూ.110 పెంచగా.. ఆవాలపై రూ.400 పెంచామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పంటలకు కనీస మద్దతు ధరను పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

పంట పెంపు ధర(క్వింటాలుకు)
గోధుమలు రూ.110 రూ.2,125
ఆవాలు రూ.400 రూ.5,450
బార్లీ రూ.100 రూ.1,735
శనగలు రూ.105 రూ.5,335
కందులు రూ.500 రూ.6,000
సన్​ఫ్లవర్ రూ.209 రూ.5,650
Last Updated : Oct 18, 2022, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details