తెలంగాణ

telangana

డ్రోన్ల ద్వారా టీకాల సరఫరా!

కరోనా వ్యాక్సిన్​లను డ్రోన్​ల సాయంతో సరఫరా చేసేందుకు ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనానికి పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లభించాయి. ​

By

Published : Apr 23, 2021, 4:56 AM IST

Published : Apr 23, 2021, 4:56 AM IST

Updated : Apr 23, 2021, 6:21 AM IST

drone,COVID-19 vaccine
డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్​ సరఫరా!

కరోనా వ్యాక్సిన్‌ను డ్రోన్​లతో సరఫరా చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డ్రోన్‌ల వినియోగంపై సాధ్యాసాధ్యాలను ఐసీఎంఆర్ అధ్యయనం చేయడానికి పౌర విమానయాన శాఖ గురువారం అనుమతి ఇచ్చింది.

ఐఐటీ కాన్పూర్, ఐసీఎంఆర్​ సంయుక్తంగా ఈ అధ్యయనం చేయనున్నాయి. ఇందుకు షరతులతో కూడిన అనుమతులు లభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అనుమతులు ఏడాది పాటు అమలులో ఉండనున్నట్లు పేర్కొంది.

ఉద్యోగులు అందరూ టీకా తీసుకోండి

కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్​ను తీసుకోవడానికి అనుమతి ఇచ్చినందున ఉద్యోగులంతా టీకా తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సూచించింది.

ఇదీ చూడండి:ప్రభుత్వ మార్గాల ద్వారానే టీకా సరఫరా: ఫైజర్‌

Last Updated : Apr 23, 2021, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details