తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు! - కొవిషీల్డ్​​ టీకాలపై నిపుణుల సూచన

govt-panel-suggests-increasing-gap-between-two-doses-of-covishield
కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు!

By

Published : May 13, 2021, 12:07 PM IST

Updated : May 13, 2021, 12:28 PM IST

12:05 May 13

కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు!

కొవిషీల్డ్​ టీకా రెండు డోసుల మధ్య ఉన్న వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆఫ్​ ఇమ్యూనైజేషన్ (ఎన్​టీఏజీఐ) కేంద్రానికి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం కొవిషీల్డ్​ రెండు డోసుల మధ్య ఉన్న వ్యవధి.. నాలుగు నుంచి ఎనిమిది వారాలు. కొవిషీల్డ్​పై సూచనలు చేసిన ఎన్​టీఏజీఐ.. కొవాగ్జిన్​ టీకాల వ్యవధిపై మాత్రం ఎలాంటి సలహాలు ఇవ్వలేదు.  

గర్భిణీలకు తమకు నచ్చిన వ్యాక్సిన్​ ఎంచుకునేలా అవకాశం కల్పించాలని నిపుణుల బృందం పేర్కొంది. బాలింతలకు ఎప్పుడైనా టీకా అందించేలా చర్యలు చేపట్టాలని సూచించింది.  

ఆరు నెలల తర్వాతే..

కరోనా బారిన పడిన వారు.. కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్రానికి ఎన్​టీఏజీఐ సూచనలు చేసింది.  

ఎన్​టీఏజీఐ చేసిన సూచనలను కొవిడ్​పై ఏర్పాటు చేసిన నేషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ ఆన్ వ్యాక్సిన్​ అడ్మినిస్ట్రేషన్​ పరిశీలించనుంది.  

ఇదీ చదవండి :వేడి నీళ్ల స్నానంతో.. కరోనా రాదా?

Last Updated : May 13, 2021, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details