రెండు నుంచి 17 ఏళ్లలోపున్న చిన్నారులపై కొవావాక్స్ టీకా రెండు,మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి ఇవ్వవద్దని నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కొవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌ను రెండు నుంచి 17ఏళ్లలోపు ఉన్న పిల్లలపై జరిపేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ సోమవారం డీసీజీఐ అనుమతి కోరింది. 12 నుంచి 17 ఏళ్ల లోపున్న 920 మందిపై, రెండు నుంచి 11ఏళ్లలోపున్న460 మంది చిన్నారులపై దేశవ్యాప్తంగా పదిచోట్ల ట్రయల్స్ చేపట్టేందుకు అనమతి ఇవ్వాలని సీరం దరఖాస్తులో కోరింది.
Covovax: పిల్లలపై ట్రయల్స్‌కు అనుమతికి నో - సీడీఎస్సీఓ
పిల్లలపై కొవావ్యాక్స్ టీకా రెండు,మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు(ఎస్ఐఐ) అనుమతి ఇవ్వడానికి నిపుణుల కమిటీ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ టీకాను ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఆమోదించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
కొవావ్యాక్స్
ఈ దరఖాస్తుపై చర్చించిన నిపుణుల బృందం.. కొవావాక్స్ ఇప్పటివరకు ఏ దేశంలోనూ అనుమతి పొందని నేపథ్యంలో చిన్నారులపై ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వవద్దని సిఫారసు చేసినట్లు సమాచారం. పిల్లలపై క్లినికల్స్ ట్రయల్స్‌కు నిర్వహణను పరిగణనలోకి తీసుకునేందుకు పెద్దలలో కొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన.. భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించాలని సీరంను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:ఫేస్బుక్ లైక్స్‌తో రేప్ కేసు నుంచి ఊరట!