తమిళనాడులో థియేటర్లు, మల్టీపెక్స్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచడంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. ఇలా చేయడం కేంద్రం మార్గదర్శకాలకు విరుద్ధమని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. తక్షణమే ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ.. విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ చేసిన మార్గదర్శకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
థియేటర్ల విషయంలో తమిళనాడుకు కేంద్రం షాక్
థియేటర్లలో ఆక్యుపెన్సీని 100శాతానికి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కొవిడ్ మార్గదర్శకాలను నీరుగార్చేలా ఉన్నాయని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. వెంటనే ఆ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని సూచించింది.
థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీ నిబంధనలకు విరుద్ధం
హోమంత్రిత్వ శాఖ 2020, డిసెంబర్ 28న జారీ చేసిన కరోనా మార్గదర్శకాలు తమిళనాడులోనూ అమలు చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రం సూచించింది.
Last Updated : Jan 6, 2021, 10:41 PM IST