Vaccine Export News: కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల వాణిజ్య ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో సరిపడా టీకా డోసులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా టీకా లభ్యత ఆధారంగా నెలనెలా ఎన్ని డోసులు ఎగుమతి చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించనుంది.
ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొవాక్స్‌లో భాగంగా నేపాల్, తజికిస్థాన్, బంగ్లాదేశ్, మొజాంబిక్ దేశాలకు 50 లక్షల డోసుల కొవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం అనుమతించింది. నేపాల్, తజికిస్థాన్‌లకు ఈ వారంలో కొవిషీల్డ్ డోసులు అందనున్నాయి.