Booster Dose in India: చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా విజృంభణ మొదలైన నేపథ్యంలో దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసును అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోసులు అందుబాటులో ఉన్నాయి.
రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం ఇదివరకు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 10న అర్హులైన వారికి బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికీ వరకు 2,05,89,099 ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసింది.