తెలంగాణ

telangana

ETV Bharat / bharat

KGFలో మళ్లీ పసిడి వేట.. తెరుచుకోనున్న కోలార్​ గోల్డ్ ఫీల్డ్స్​ తలుపులు! - కర్ణాటక కేజీఎఫ్​ లెేటెస్ట్​ న్యూస్​

కేజీఎఫ్​ ఈ పేరు వినగానే యశ్‌ హీరోగా.. నటించిన సినిమా గుర్తుకు వస్తోంది. ఆ సినిమాలో చూపించినదంతా నిజం కాకపోయినా.. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ఒకప్పుడు బంగారు కొండలు. వేల కిలోల స్వర్ణాన్ని కేజీఎఫ్ నుంచి వెలికితీశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మూసేసిన కేజీఎఫ్ తలుపులు మళ్లీ తెరుచుకోనున్నాయి. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో బంగారాన్ని వెలికితీయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. 50 మిలియన్‌ టన్నుల శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికి తీసేందుకు.. బిడ్‌లు ఆహ్వానించాలని కేంద్రం సమాలోచనలు చేస్తోంది.

kolar gold fields
kolar gold fields

By

Published : Dec 15, 2022, 10:40 PM IST

Kolar Gold Mines: దాదాపు 20 ఏళ్ల క్రితం మూతపడిన కోలార్‌ గోల్ట్‌ ఫీల్డ్స్‌ కేజీఎఫ్ తలుపులు మళ్లీ ఇన్నాళ్లకు తెరుచుకోనున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరుకు దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీఎఫ్​లో మళ్లీ బంగారం వెలికి తీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 మిలియన్‌ టన్నుల శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికితీసేందుకు బిడ్లను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని.. ఈ గనులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు. కేజీఎఫ్​లో 2.1 బిలియన్‌ డాలర్ల విలువైన.. బంగారు నిక్షేపాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. గతంలో శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికితీయాలని ప్రణాళికలు రచిస్తోంది. బంగారాన్ని వెలికి తీసేందుకు ఉన్న.. ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని.. కేంద్రం చూస్తోంది. బంగారంతో పాటు.. పల్లాడియంను కూడా వెలికితీయాలని ప్రభుత్వం భావిస్తోంది.

శుద్ధి చేసిన ఖనిజంలోని బంగారు నిల్వలను ఎలా గుర్తించి.. వెలికి తీయాలన్న దానిపై దృష్టి కేంద్రీకరించామని ఆ అధికారి తెలిపారు. రాబోయే నాలుగైదు నెలల్లో బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం చూస్తోందన్నారు. శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికితీసే సాంకేతికత విదేశాల్లోనే ఉంది. ఆ విదేశీ కంపెనీలు స్థానిక కంపెనీలతో ఒప్పందం చేసుకుని.. లేదా కన్సార్షియం ఏర్పాటు చేసుకుని బంగారాన్ని వెలికి తీసేందుకు బిడ్‌ దాఖలు చేయవచ్చని ఆ అధికారి వెల్లడించారు.

కేజీఎఫ్​ లో భూగర్భం నుంచి బయటకు తెచ్చిన మట్టిలో బంగారాన్ని సేకరించిన తర్వాత గుట్టలుగా పోశారు. కేజీఎఫ్ చుట్టూ ఇలాంటి 13 గుట్టలు ఉన్నాయి. వీటి నుంచి బంగారం వెలికి తీసేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానిస్తోంది. 50 మిలియన్ టన్నుల మట్టిని ఇప్పటికే నిపుణులు పరిశోధించారు. ఇక్కడి మట్టిలో 25 టన్నుల బంగారం సేకరించవచ్చని అంచనా వేశారు. చైనా తర్వాత భారత్‌ ప్రపంచంలో..అతిపెద్ద బంగారు వినియోగదారుగా ఉంది. భారత్‌ దిగుమతిలోనూ... డిమాండ్‌లోనూ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది. బంగారం డిమాండ్‌ను తగ్గించేందుకు.... బంగారం దిగుమతులపై సుంకాన్ని 7.5 శాతం నుంచి 12.5 శాతానికి కేంద్రం పెంచింది.

ABOUT THE AUTHOR

...view details