కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లి వెంట ఉన్న 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అక్కడి సెక్యూరిటీ గార్డు.
దమణ్ జిల్లాలోని మార్వాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి 11న ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ చికిత్స పొందుతోన్న తన తల్లితో కలిసి బాలిక ఉందని అధికారులు చెప్పారు. చిన్నారికి తాగునీరు ఇచ్చే నెపంతో ఆసుపత్రిలోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.
ఈ ఘటన బయటపడిన అనంతరం ఆసుపత్రి నుంచి సెక్యూరిటీ గార్డ్ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం విస్తృతంగా గాలించారు. శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు.