విదేశీ తయారీ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. దేశంలో టీకాల లభ్యతను పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
భారత్లో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించే ముందు తొలుత 100 మంది లబ్ధిదారులకు అందించి, వారం రోజుల పాటు సమీక్షించనున్నారు. అమెరికా, ఐరోపా, యూకే, జపాన్ సహా ఇతర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన టీకాలకు మన దేశంలోనూ ఆమోదముద్ర వేయాలన్న నిపుణుల కమిటీ సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.