ఒక్కడోసులో ఇచ్చే 'స్పుత్నిక్ లైట్' టీకా త్వరగా అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కోసం దరఖాస్తు చేయాలని రష్యాకు చెందిన తయారీ సంస్థ, భారత్కు చెందిన భాగస్వాములను ఆదేశించింది.
త్వరలో అందుబాటులోకి 'స్పుత్నిక్ లైట్'! - సింగిల్ డోసు టీకా
స్పుత్నిక్ లైట్ టీకా మరికొద్ది రోజుల్లో దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది.
స్పుత్నిక్ లైట్, సింగిల్ డోస్ టీకా
ఇది అందుబాటులోకి వస్తే దేశంలో ఇచ్చే తొలి 'సింగిల్ డోస్ టీకా' ఇదే అవుతుంది. గతవారం కేబినెట్ సెక్రెటరీ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిగింది.