రాజస్థాన్‌లో ఫోన్ ట్యాపింగ్ వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అశోక్ గహ్లోత్ సర్కార్ ప్రజలపై రహస్య నిఘా ఉంచుతోందని భాజపా ఎంపీ రాజవర్ధన్ సింగ్ రాఠోడ్ ఆరోపించారు. దేశ బలోపేతం కోసమో, ఉగ్రవాదులను పట్టుకోవడం కోసమో కాకుండా.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని విమర్శించారు. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
రాజస్థాన్‌లో ఫోన్ ట్యాపింగ్‌పై రగడ
రాజస్థాన్‌లో ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుమారం చెలరేగింది. ప్రభుత్వం ప్రజలపై నిఘా ఉంచుతోందని భాజపా ఆరోపించింది. దేశ బలోపేతం కోసమో, ఉగ్రవాదులను పట్టుకోవడం కోసమో కాకుండా.. స్వార్థ రాజకీయాల కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని విమర్శించింది. ఈ ఆరోపణలను అధికార కాంగ్రెస్ తోసిపుచ్చింది. తాము ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయమని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు పన్నేవారే అలా చేస్తారని బదులిచ్చింది.
భాజపా ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తాము ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయమని రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్ తెలిపారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్రలు పన్నే వారే(భాజపా నేతలను ఉద్దేశించి) అలా చేస్తారని దీటుగా బదులిచ్చారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అలాగే పడొగట్టారని, రాజస్థాన్‌లోనూ ఆ కుట్ర జరిగిందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధాలున్న వారు రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారని, రాజీనామా అడగడానికి వారెవరని ప్రశ్నించారు. భాజపాలో అంతర్గత విభేదాలున్నాయని ప్రతాప్ సింగ్ అన్నారు. కేంద్రమంత్రి, భాజపా నేత సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ వారు నిజాయితీపరులైతే ఆ ఆడియో క్లిప్‌లోని స్వరం తమది కాదని సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిజాలు ప్రపంచానికి తెలియజేయవచ్చు కదా అని అన్నారు.
ఇదీ చూడండి:ఈసీ విధుల్లో అమిత్ షా జోక్యం: మమత