తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Cowin పోర్టల్​ హ్యాక్​ అయిందా?

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కోసం వినియోగిస్తున్న 'కొవిన్'​ పోర్టల్​ హ్యాక్​కు గురైందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని పేర్కొంది. వ్యాక్సినేషన్​ వివరాలు డిజిటల్ రూపంలో​ అత్యంత భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

cowin portal hack news
కొవిన్​ పోర్టల్​

By

Published : Jun 11, 2021, 2:19 PM IST

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు రూపొందించిన కొవిన్(Cowin) పోర్టల్​ హ్యాక్​కు గురైందని పలు మీడియాల్లో వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అవన్నీ పూర్తి అవాస్తవాలని తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్​ వివరాలన్ని డిజిటల్​గా, భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడదల చేసింది.

అయితే.. ఈ వార్తలపై సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్​ దర్యాప్తు చేపట్టిందని ప్రకటనలో కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details