నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమన్నారు. 22 మంది జవాన్ల అమరులైన బీజాపుర్ ఎన్కౌంటర్పై జగదల్పుర్లో ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు షా.
" అమర జవాన్ల ధైర్య సాహసాలు, త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు. దేశం మొత్తం వారి కుటుంబాలకు అండగా ఉంటుంది. నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. చివరకు గెలిచి తీరతాం. గత కొన్నేళ్లుగా దట్టమైన అటవీ ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నాయి. దీనిని జీర్ణించుకోలేకే నక్సలైట్లు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.