తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఖరీఫ్​లో రూ. 60 వేల కోట్ల పంట కొనుగోళ్లు'

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్​లో రూ.60,038.68 కోట్ల విలువైన పంటను కొనుగోలు చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పలు రాష్ట్రాల్లో ఎంఎస్​పీ పథకాల ద్వారా పంటల కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది.

Govt continues to procure Kharif crops at its MSP from farmers as per its existing MSP Schemes
'ఖరీఫ్​లో రూ. 60 వేల కోట్ల పంట కొనుగోళ్లు'

By

Published : Dec 1, 2020, 8:34 PM IST

వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) రద్దవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న ఎంఎస్​పీ పథకాల ద్వారా ఖరీఫ్ పంట కొనుగోళ్లను కొనసాగిస్తూనే ఉందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది.

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్​లో రూ.60,038.68 కోట్ల పంటను కొనుగోలు చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పంట కొనుగోళ్లపై కేంద్రం గణాంకాలు

ఇదే సమయంలో వరి కొనుగోలు సైతం సాఫీగా జరుగుతోందని స్పష్టం చేసింది. పంజాబ్, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్, తెలంగాణా, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ముకశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వరి కొనుగోళ్లు చేపట్టినట్లు వివరించింది.

ABOUT THE AUTHOR

...view details