కరోనా టీకా ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. టీకా ఉత్సవ్ లు జరుపుకున్న ప్రభుత్వం.. వ్యాక్సిన్ అందించే సౌకర్యాలను మాత్రం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దీని కారణంగానే దేశంలో వ్యాక్సినేషన్ శాతం తగ్గిందని వివరించారు.
"టీకాలను భారత్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. ఏప్రిల్ 12న కేంద్రం టీకా ఉత్సవ్ ను ప్రారంభించింది. కానీ వ్యాక్సిన్ అందించే సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. దీని కారణంగా గత 30 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 82 శాతం తగ్గింది. వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను మోదీ సందర్శించి ఫొటోలు దిగారు. కానీ జనవరి 2021లో, చాలా ఆలస్యంగా వ్యాక్సిన్ మొదటి విడత పంపిణీ చేపట్టారు."