భాజపాను, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మలేమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ అన్నారు. సాగు చట్టాలపై ఉద్యమం సుదీర్ఘకాలం జరిగే అవకాశం ఉన్నందున రైతులు దీనిని వారి దినచర్యలో భాగం చేసుకోవాలని పేర్కొన్నారు. దిల్లీ ఉత్తర్ప్రదేశ్ సరిహద్దులోని గాజీపుర్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు నరేశ్.
"భాజపా ప్రభుత్వాన్ని నమ్మలేము. ఇక నుంచి ఈ ఉద్యమాన్ని మీ దినచర్యలో భాగంగా భావించాలి. సత్యపాల్ మాలిక్ (మేఘాలయ గవర్నర్) వంటి వ్యక్తులు మరింత మంది మనకు మద్దతు తెలుపుతారు. భాజపా ఎంపీలు ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు." అని అన్నారు నరేశ్.