కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు చేశారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం అతి విశ్వాసం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు. వైరస్ ఇంకా పూర్తిగా అంతం కాకముందే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
దేశంలో ఇటీవల దక్షిణాఫ్రికా, బ్రెజిలియన్ రకం వైరస్లు బయటపడిన తర్వాత ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.
దేశంలో తొలిసారిగా దక్షిణాఫ్రికా రకం వైరస్ వేరియంట్ బారినపడిన వారిని నలుగురిని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరో వ్యక్తికి బ్రెజిల్ రకం వైరస్ సోకినట్టు పేర్కొంది. బాధితులలో ఒకరు అంగోలా, మరొకరు టాంజానియా నుంచి రాగా.. మరో ఇద్దరు వ్యక్తులు దక్షిణాఫ్రికా నుంచి జనవరిలో వచ్చారని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు.
ఇదీ చదవండి:కశ్మీర్లో 31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న గుడి