తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ బోర్డు పునర్​వ్యవస్థీకరణ - రాజ్​నాథ్​ సింగ్ న్యూస్

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు వునర్వ్యవస్థీకరణకు కేేంద్రం ఆమోదం తెలిపింది. ఆయుధాలు, సైనిక సంబంధ పరికరాల ఉత్పత్తి కోసం ఉన్న 41 కేంద్రాలను ప్రభుత్వ ఆధీనంలోని ఏడు కార్పొరేట్‌ సంస్థలుగా విభజించడానికి సమ్మతించింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.

OFB
ఓఎఫ్​బీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు

By

Published : Jun 17, 2021, 7:21 AM IST

Updated : Jun 17, 2021, 9:22 AM IST

పురాతనమైన 'ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు' (ఓఎఫ్‌బీ)ని పునర్వ్యవస్థీకరించడానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. చాలాకాలం నుంచి ఉన్న ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఆయుధాలు, సైనిక సంబంధ పరికరాల ఉత్పత్తి కోసం ఉన్న 41 కేంద్రాలను ప్రభుత్వ ఆధీనంలో ఏడు కార్పొరేట్‌ సంస్థలుగా విభజించడానికి సమ్మతించింది. జవాబుదారీతనం, సమర్థత, పోటీతత్వాలను మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఓఎఫ్‌బీలో ఉన్న దాదాపు 70,000 మంది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు.

నౌకాయాన స్వేచ్ఛ అవసరం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నియమాల ఆధారిత వ్యవస్థ ఉండాలని, నౌకాయాన స్వేచ్ఛ అవసరమనీ రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రం సహా అంతర్జాతీయ జల మార్గాల్లో వాణిజ్యానికి ఎలాంటి అవరోధాలు ఉండకూడదని చెప్పారు. దూకుడు కనపరుస్తున్న చైనా పేరెత్తకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియాన్‌ దేశాల రక్షణ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఉగ్రవాద బెడద నిర్మూలనకు ఉమ్మడిగా ప్రయత్నాలు జరగాల్సి ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ

Last Updated : Jun 17, 2021, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details