EPF Interest Rate: 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటు ఖరారైంది. ఈపీఎఫ్ జమలపై 8.1శాతం వడ్డీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్ పై వడ్డీరేటును నాలుగు దశాబ్దాల దిగువకు తగ్గించింది. ఈ మేరకు ఈపీఎఫ్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మార్చిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్ నిర్ణయించింది. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపింది. వడ్డీ రేటుకు కేంద్రం ఆమోదం తెలపడం వల్ల ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని జమ చేయనుంది.
ఈపీఎఫ్ వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం.. ఎంతంటే?
EPF Interest Rate: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై ఉద్యోగులకు 8.1 శాతం వడ్డీ రేటును ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసింది.
వడ్డీరేటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకున్న కేంద్ర కార్మిక, ఆర్థిక శాఖల పనితీరు అభినందనీయమని ఈపీఎఫ్ఓ ధర్మకర్త కేఈ రఘునాథన్ తెలిపారు. ఉద్యోగుల పిల్లల చదువులకు, అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5శాతంగా ఇచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే వడ్డీ రేటును కొనసాగించారు. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు.
ఇదీ చదవండి:ఆమె కడుపులో రూ.3కోట్లు విలువైన డ్రగ్స్.. వారం కష్టపడితే..