'నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రైబ్యునల్'(ఎన్సీఎల్టీ), 'ది ఇన్కం ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్(ఐటీఏటీ)'కి కేంద్రం 31 మంది సభ్యులను నియమించింది. న్యాయ, సాంకేతిక, అకౌంటెంట్ విభాగాల్లో వీరిని నియమించింది. వివిధ ట్రైబ్యునల్స్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్సీఎల్టీ, డీఆర్టీ, టీడీఎస్ఏటీ, ఎస్ఏటీ సంస్థల్లో మొత్తం 250 ఖాళీలు ఉన్నట్లు తేలింది. 8 మంది జ్యుడీషియల్, 10 మందిని సాంకేతిక విభాగంలో ఎన్సీఎల్టీలో నియమించగా, ఐటీఏటీలో 13 మంది జ్యుడీషియల్, అకౌంటెంట్ విభాగంలో నియమిస్తూ.. సెప్టెంబర్ 11న సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియమితులైన అధికారులు ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.