Padma Awards: 2022 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నలుగురికి పద్మ విభూషణ్, 17మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గానూ ఈ అవార్డులు అందిస్తోంది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా ఇటీవలి కాలంలో మరణించిన పలువురు ప్రముఖులు ఈ గౌరవం పొందినవారి జాబితాలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, కరోనా టీకాలు తయారు చేసిన సీరం, భారత్ బయోటెక్ సంస్థల ఛైర్మన్లు సహా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం తెచ్చిన నీరజ్ చోప్డాకు పద్మ పురస్కారాలు దక్కాయి.
పద్మ విభూషణ్ పొందిన వారు
- ప్రభ ఆత్రే, మహారాష్ట్ర
- శ్రీ రాధేశ్యామ్ ఖామ్కే(మరణానంతరం), ఉత్తర్‌ప్రదేశ్
- జనరల్ బిపిన్ రావత్(మరణానంతరం), ఉత్తరాఖండ్.
- శ్రీ కల్యాణ్ సింగ్(మరణానంతరం), ఉత్తర్‌ప్రదేశ్
పద్మ భూషణ్ పొందిన వారిలో ప్రముఖులు..
- శ్రీ గులాం నబీ ఆజాద్(జమ్ముకశ్మీర్)
- భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్
- సీరం ఛైర్మన్ సైరస్ పూనావాలా
- బుద్ధదేవ్ భట్టాచార్య
- మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
- గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు