సీపీఎం దిగ్గజ నేత, బంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు కేంద్రం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును బుద్ధదేవ్ తిరస్కరించారు.
పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన బంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ - పద్మ అవార్డులు
Padma Awards
22:23 January 25
అవార్డు గురించి తనకు ఏమీ తెలియదని, ఒకవేళ పద్మభూషణ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే.. తాను దానిని నిరాకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
20:07 January 25
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం- రావత్‌కు పద్మ విభూషణ్
- పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- నలుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు
- 17 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు
- 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు
- జనరల్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్ పురస్కారం
- జనరల్ బిపిన్ రావత్‌కు మరణానంతరం పద్మవిభూషణ్
- రాధేశ్యామ్ ఖేమ్కాకు పద్మ విభూషణ్ అవార్డు
- రాధేశ్యామ్ ఖేమ్కాకు మరణానంతరం పద్మ విభూషణ్
- కల్యాణ్ సింగ్‌కు పద్మ విభూషణ్ అవార్డు
- కల్యాణ్ సింగ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డు
- భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలకు సంయుక్తంగా పద్మ భూషణ్
- కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్
- గులాం నబీ ఆజాద్ (జమ్ముకశ్మీర్)కు పద్మ భూషణ్
- బుద్ధదేవ్ భట్టాచార్య (బంగాల్)కు పద్మ భూషణ్
- మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు పద్మ భూషణ్
- గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు పద్మ భూషణ్
- గరికపాటి నరసింహారావు (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
- గోసవీడు షేక్ హసన్ (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
- డా.సుంకర వెంకటఆదినారాయణ (ఏపీ)కు పద్మశ్రీ అవార్డు
- దర్శనం మొగిలయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
- రామచంద్రయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
- పద్మజా రెడ్డి (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
- ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌కు పద్మశ్రీ అవార్డు
- టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు పద్మశ్రీ
Last Updated : Jan 25, 2022, 10:32 PM IST