తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ నుంచి రష్యాకు 40 లక్షల 'సింగిల్​ డోస్'​ టీకాలు! - Sputnik V vaccine

దేశీయంగా ఉత్పత్తి చేసిన స్పుత్నిక్​ లైట్ (Sputnik vaccine India)​ సింగిల్​ డోస్​ కరోనా టీకాను.. రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 40 లక్షల డోసులను(Sputnik V vaccine) ఆ దేశానికి సరఫరా చేయనుంది హెటిరో బయోఫార్మా.

Russian COVID vaccine Sputnik Light
సింగిల్​ డోస్​ టీకా ఎగుమతికి కేంద్రం గ్రీన్​సిగ్నల్​

By

Published : Oct 10, 2021, 3:18 PM IST

సింగిల్​ డోస్​ కొవిడ్​-19 వ్యాక్సిన్​ స్పుత్నిక్​ లైట్(Sputnik vaccine India)​ ఎగుమతికి కేంద్రం అనుమతించింది. భారత్​కు చెందిన ఔషధ సంస్థ హెటిరో బయోఫార్మా లిమిటెడ్​.. దేశీయంగా ఉత్పత్తి చేసిన 40 లక్షల డోసులను రష్యాకు పంపనుంది.

రెండు డోసుల స్పుత్నిక్​ వి టీకాను(Sputnik vaccine India) రూపొందించిన.. రష్యా సంస్థ ఆర్​డీఐఎఫ్​(రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​) ఒకే డోసు స్పుత్నిక్​ లైట్​ టీకాను కూడా అభివృద్ధి చేసింది. స్పుత్నిక్​ వి టీకా అత్యవసర వినియోగానికి భారత్​లో ఏప్రిల్​లోనే ఆమోదం లభించినా.. ఈ సింగిల్​ డోస్​ టీకాను ఇంకా ఆమోదించలేదు. అయితే.. సింగిల్​ డోస్​ టీకాను భారత్​లో ఉత్పత్తి చేసేందుకు గతంలోనే హెటిరోతో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్​డీఐఎఫ్​.

హెటిరోలో ఇప్పటివరకు స్పుత్నిక్​ వి (Sputnik V vaccine) 10 లక్షలు, స్పుత్నిక్​ లైట్​ టీకా డోసులు 20 లక్షల మేర ఉత్పత్తి చేసినట్లు రష్యా అంబాసిడర్​ కుదషెవ్​ తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. రష్యాకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని అనుమతించగా అందుకు సమ్మతం తెలిపింది మోదీ సర్కార్​.

త్వరలో వినియోగానికి..

స్పుత్నిక్​ లైట్​ టీకా(Sputnik V vaccine) ట్రయల్స్​ను.. భారత్​లో డాక్టర్​ రెడ్డీస్​ లాబోరేటరీస్​ చేపడుతోంది. గత సెప్టెంబర్​లోనే ఫేజ్​-3 క్లినికల్​ పరీక్షలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి లభించింది.

అతి త్వరలో సింగిల్​ డోస్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు లభించే అవకాశాలున్నాయి.

ఏంటీ స్పుత్నిక్ లైట్?

ఒకే డోసు 'స్పుత్నిక్‌ లైట్‌' టీకాను(Sputnik vaccine India) రష్యా రూపొందించింది. దీనికి అక్కడ అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 79.4% ప్రభావశీలత కనబరిచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. ఈ టీకా తీసుకున్న వారిలో 28 రోజుల నాటికి వైరస్‌ను ఎదిరించే యాంటీ-బాడీలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్‌ నూతన వేరియెంట్ల పైనా పనిచేస్తోందని సంస్థ స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో కొవిడ్‌-19 తీవ్రత దృష్ట్యా ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనికి ఒకే డోసు టీకా మంచి పరిష్కారమని ఆర్‌డీఐఎఫ్‌ తెలిపింది.

ఇవీ చూడండి: 'స్పుత్నిక్‌ తయారీకి కేంద్ర బిందువుగా భారత్‌'

Sputnik-V: స్పుత్నిక్‌-వి టీకా సరఫరా ప్రారంభం

'స్పుత్నిక్​ లైట్'​ మూడోదశ ట్రయల్స్​కు డీసీజీఐ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details